అమరావతి: టాలీవుడ్ నటుడు శ్రీనివాస రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ‘తిరుమల శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు’ డైరెక్టర్ పదవికి ఆయనను ఎంపిక చేసినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు ప్రముఖ టీవీ యాంకర్ స్వప్నను కూడా డైరెక్టర్‌గా జగన్ సర్కార్ ఎంపిక చేసిందని సమాచారం. ఇప్పటికే సినీ రంగానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు ఛానల్ చైర్మన్‌గా ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించడంపై టాలీవుడ్లో ఆనందం వ్యక్తమవుతోంది. శ్రీనివాస్ రెడ్డి మిత్రబృందంతో ఏర్పడ్డ ‘ఫ్లయింగ్ కలర్స్’ ప్రత్యేకంగా అభినందిస్తోంది.
