మన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు. అలాంటిది ఈమధ్యే కనిపెట్టిన నియోవైజ్ అనే తోకచుక్క మాత్రం… ఇప్పుడు భూమికి దగ్గర నుంచి వెళ్లబోతూ… మన కళ్లకు కనిపించనుంది. వారం కిందట అది బుధగ్రహం కక్ష్యను దాటింది. ఇప్పుడు అది భూమిపై నుంచి వెళ్తోంది. ఇది భారతీయులకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మంగళవారం నుంచి దీన్ని స్పష్టంగా చూడవచ్చు. దాదాపు 20 రోజులపాటూ.. ఇది ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత… 20 నిమిషాలపాటూ… వాయవ్య ఆకాశంలో దీన్ని చూడగలం. జులై 22-23 తేదీల్లో ఇది భూమికి 10.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ రోజుల్లో ఇది మరింత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మిస్సైతే… ఈ తోకచుక్క మళ్లీ కనిపించేది 8786లోనే. అందువల్ల దీన్ని ఇప్పుడే చూసేయాలి. ఇది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) తెలిపింది.
Comet NEOWISE from ISS, July 5th pic.twitter.com/pAbGdtchAc
— Seán Doran (@_TheSeaning) July 7, 2020