Breaking News
Home / National / ఎన్‌కౌంటర్‌పై విచారణకు కమిషన్‌…

ఎన్‌కౌంటర్‌పై విచారణకు కమిషన్‌…

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, దహనం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి విఎస్‌ సిర్పుర్కార్‌ ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సిబిఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌కు సిఆర్‌పిఎఫ్‌ భద్రత కల్పిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కమిషన్‌ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అంతకుముందు ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

మీరెందుకు పిటిషన్‌ దాఖలు చేశారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్‌కౌంటర్‌ చేశారని, అది బూటకపు ఎన్‌కౌంటరని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. అసలక్కడ ఏం జరిగిందో ఎవరికీ స్పష్టంగా తెలియదని సిజెఐ అన్నారు. నలుగురు నిందితులు పోలీసులపై దాడి చేశారా? వారు లాక్కున్న పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపారా అని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితులు తుపాకీతో ఫైర్‌ చేశారని, బుల్లెట్లు పోలీసులకు తాకలేదని తెలంగాణ తరఫున హాజరైన న్యాయవాది రోహత్గి విన్నవించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో అక్కడ ఎవరెవరున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం
పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *