ఖమ్మం: వన్ టౌన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మసూద్ అలీ రాత్రి స్టేషన్ డ్యూటీ నిర్వహిస్తుండగా అర్ధరాత్రి కంప్లైంట్ చెయ్యటానికి ఓ వ్యక్తి వచ్చాడు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, తొడ కాండరాలు, చేతి వేలుపై కొరకడంతో కానిస్టేబుల్ చిటికెన వేలు తెగి కిందపడింది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు.
