Breaking News
Home / States / Andhra Pradesh / ఎమ్మెల్యేతో పాటు ఐదుగురిపై ఫిర్యాదు..

ఎమ్మెల్యేతో పాటు ఐదుగురిపై ఫిర్యాదు..

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు.

తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *