Breaking News
Home / States / Andhra Pradesh / లలితా జ్యువెలర్స్‌పై ఫిర్యాదు.. తనిఖీలు చేసిన అధికారులు..

లలితా జ్యువెలర్స్‌పై ఫిర్యాదు.. తనిఖీలు చేసిన అధికారులు..

విజయవాడ: లలితా జ్యువెలరీలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బంగారు ఆభరాణాలను కొలతలు వేసి వస్తువుల బరువులను పరిశీలించారు. లలితా జ్యువెలరీపై ఫిర్యాదు వచ్చిందని, అందుకే తనిఖీలు నిర్వహించామని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ ఆప్ లీగల్ మెట్రాలజీ రాజ్ కుమార్ అన్నారు. బంగారం నాణ్యత, బరువులో ఎటువంటి లోపాలు లేవని చెప్పారు. బంగారం వస్తువులలో పొందు పరిచే రాళ్లు, పూసల విషయంలో బిల్లులు చూపటంలేదని తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *