Breaking News
Home / Film News / ‘సాహో’ నిర్మాతలపై ఫిర్యాదు

‘సాహో’ నిర్మాతలపై ఫిర్యాదు

మాదాపూర్‌: యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన సాహో సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా నిర్మాతలపై బెంగళూరుకు చెందిన జౌట్‌షైన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తరఫున తమ బ్రాండ్‌కు సంబంధించి ఆర్క్‌టిక్‌ ఫాక్స్‌ పేరును సినిమా మధ్యలో చూపిస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.37 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ సంస్థలో మార్కెటింగ్‌ హెడ్‌గా పనిచేస్తున్న విజయ్‌రావు గురువారం మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం…సాహో మూవీకి చెందిన నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డితోపాటు సెలబ్రిటీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈఓ హిమాంద్‌ దువ్వూరు తమ సంస్థ బ్రాండ్‌ను సినిమా మధ్య మార్కెటింగ్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేసినట్టు విజయ్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందుకోసం మధ్యవర్తికి 1.49 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. అంతే కాకుండా జౌట్‌ షైన్‌ఇండియా కంపెనీ నుంచి హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో బ్రాడ్‌కాస్టింగ్‌ చేసుకోవడానికి రూ.కోటి పెట్టుబడి పెట్టామన్నారు. ఒప్పందం ప్రకా రం తమ బ్రాండ్‌ను సినిమా మధ్యలో చూపించలేదని విజయ్‌రావు చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు విచారణ ప్రారంభించారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *