Breaking News
Home / Politics / ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్….

ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్….

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని బయటకు పంపించాలని టీఆర్ఎస్  కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ హుజూర్‌నగర్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఉత్తమ్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *