Breaking News
Home / Politics / ఐదు రౌండ్లు పూర్తి…సంబరాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు….

ఐదు రౌండ్లు పూర్తి…సంబరాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు….

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రముఖ మీడియాతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాయన్నారు. తొలి రౌండ్ మొదలుకుని ఐదో రౌండ్ పూర్తయ్యే వరకూ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం టీఆర్ఎస్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేదు. మరోవైపు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల పరిస్థితి గురించి ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు..

తొలి రౌండ్ ప్రారంభం నుంచే టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హుజూర్‌నగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, సైదిరెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని అప్పుడే స్వీట్స్ పంచుకుని బాణాసంచాలు పేల్చుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ మొత్తం ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదు రౌండ్లలోనూ కారు జోరుగా దూసుకెళ్తోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 11వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *