Breaking News
Home / States / Andhra Pradesh / నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. నరసరావుపేటలో గురువారం కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 500కి చేరింది. రెండు రోజుల్లో 51 కేసులు నమోదు కాగా.. వీరిని కోవిడ్ కేంద్రాలు, సదరు ఆసుపత్రులకు తరలించకపోవడంతో వారు గృహాలకే పరిమితం అయ్యారు. కొవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. చిలకలూరిపేటలో కూడా గురువారం ఆరు కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని మద్దినగర్‌కు చెందిన ఓ యువకునికి పాజిటివ్ రాగా అతని కుటుంబ సభ్యులు నలుగురికి పరీక్షలు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మండలంలోని గంగన్నపాలెంలో ఆర్ఎంపీ వైద్యుడికి పాజిటివ్‌గా తేలింది. సత్తెనపల్లి పట్టణంలో గురువారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.

Check Also

శ్రీవారి హుండీ ఆదాయం రూ.64లక్షలు

Share this on WhatsAppతిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 6917 మంది భక్తులు దర్శించుకున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *