Breaking News
Home / States / ఒకరు ఆత్మహత్య…మరొకరికి చేయి విరుగుడు…

ఒకరు ఆత్మహత్య…మరొకరికి చేయి విరుగుడు…

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌సీయూ డిపో వద్ద ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యకు యత్నించారు. యూసఫ్‌గూడకు చెందిన జి.సందీప్‌ (40) అనే కండక్టర్‌ బ్లేడ్‌తో చేయి కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నం చేశాడు. వెంటనే పక్కనే ఉన్న తోటి కార్మికులు గమనించి ఆయన్ను కొండాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మరో కండక్టర్‌కు విరిగిన చేయి
సమ్మెలో భాగంగా కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పోలీసులు-కార్మికులకు మధ్య తోపులాట జరిగి రాజేశ్‌ అనే కండక్టర్‌కు చేయి విరిగింది. మిగతా కార్మికులు ఆయన్ను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *