Breaking News
Home / National / కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఇవాళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి హర్షవర్థన్ లేవనెత్తడంతో రగడ మొదలైంది. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ వివరణ ఇవ్వాలనీ.. భేషరతుగా క్షమాపణ చెప్పాలని హర్షవర్థన్ డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఆయన వద్దకు దూసుకు వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ సభ్యుడు కేంద్రమంత్రి చెయ్యి పట్టుకోవడంతో…. ఆయనపై చేయి చేసుకుంటారా అంటూ అధికారపక్షం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు కూడా రావడంలో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *