Breaking News
Home / Lifestyle / Business / అమెరికాతో విభేదాలు త్వరలో పరిష్కారం

అమెరికాతో విభేదాలు త్వరలో పరిష్కారం

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య విభేదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని విదేశాంగమంత్రి జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. అందుకోసం అమెరికాలో నూతన ప్రభుత్వం కొలువుదీరే వరకు వేచిచూడాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారన్నారు. మూడు రోజుల వాషింగ్టన్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ కానున్నారు.

మరోవైపు తమ ఉత్పత్తులకు భారత్‌లో సమర్థనీయమైన మార్కెట్‌ కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు వల్ల అమెరికాయే నష్టపోతోందని ఇటీవల అమెరికా చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ట్రంప్‌ పాలకవర్గానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొంటామని ఇటీవల మోదీతో భేటీ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

Check Also

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

Share this on WhatsAppజోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *