Breaking News
Home / National / ఓ పార్టీకి విజయం కట్టబెట్టేందుకే ….

ఓ పార్టీకి విజయం కట్టబెట్టేందుకే ….

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రధాన పార్టీల అధినేతలు గృహనిర్బంధంలో ఉండగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారని, కార్యకర్తలు ఎలా సిద్ధం కాగలరని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్‌ గులాం అహ్మద్ మీర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. తేదీలు ప్రకటించే ముందు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకే ఇలా హడావిడిగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. అక్టోబర్ 24న జమ్మూకాశ్మీర్‌లో బీడీసీ ఎన్నికలు జరగనున్నాయి.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *