Breaking News
Home / States / గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం…

గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం…

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పురపాలక ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి తదితర అంశాలపై నేతలు చర్చించారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

కోర్‌కమిటీ సమావేశం అనంతరం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం తదితర అంశాలపై ఏఐసీసీ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌, ఆర్థిక నిపుణుడు శ్రీనివాసరావు నేతలకు అవగాహన కల్పించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *