Breaking News
Home / National / కాంగ్రెస్ నీరసించిపోలేదు…

కాంగ్రెస్ నీరసించిపోలేదు…

ముంబై : కీలకమైన అసెంబ్లీ ఎన్నికల యుద్ధం నుంచి కాంగ్రెస్ పారిపోయిందన్న విమర్శలపై ఆ పార్టీ చిరకాల మిత్రుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. యుద్ధరంగం నుంచి కాంగ్రెస్ పారిపోయిందన్న విమర్శను ఆయన ఖండించారు. ‘కాంగ్రెస్ నీరసించిపోలేదు. కార్యక్షేత్రంలో చాలా తీవ్రంగా పనిచేస్తోంది” అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ మూలాలు చాలా బలంగా ఉన్నాయని, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చాలా బలంగా పనిచేయడానికి తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీలు ఎన్నికల రంగంలో అలసిపోయాయి అన్న సుశీల్ షిండే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తాము అలసిపోలేదని, షిండేనే అలిసిపోయాడు అని కౌంటర్ ఇచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *