ఢిల్లీ: నేడు ‘కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(కాంకర్) యూనియన్ సభ్యులను కలిసిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కాంకర్ను ప్రధాని మోదీ తన పారిశ్రామిక రంగ స్నేహితులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో యూనియన్ సభ్యులు సమర్పించిన పిటిషన్‌ను రాహుల్ ట్విటర్లో పోస్టు చేసి ‘అత్యంత లాభాల్లో ఉన్న కంటైనర్ కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక ఆభరణంలాంటిది. అలాంటి సంస్థను దక్కించుకోవాలని ప్రధాని మోదీ ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు కొందరు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ సంస్థను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది’ అని పేర్కొన్నారు. కాంకర్ యూనియన్‌కు అండగా ఉండాలని కోరారు.