Breaking News
Home / National / ఎన్‌కౌంటర్ పై కాంగ్రెస్ నాయకురాలు వ్యాఖ్యలు….

ఎన్‌కౌంటర్ పై కాంగ్రెస్ నాయకురాలు వ్యాఖ్యలు….

న్యూఢిల్లీ: దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా తన కుమార్తెల జోలికొస్తే అలాగే చంపేందుకు సిద్ధపడేదానినని ఆమె పేర్కొన్నారు. వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. చటాన్‌పల్లి వద్ద నిందితులు దిశకు నిప్పంటించిన చోటే ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలంలో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో.. ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు హతమయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *