Breaking News
Home / News / రేవంత్ రెడ్డికి తప్ప పీసీసీ ఎవరికిచ్చినా ఓకే …

రేవంత్ రెడ్డికి తప్ప పీసీసీ ఎవరికిచ్చినా ఓకే …

పీసీసీ మార్పుపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. రాహుల్ ‌గాంధీకి ఉత్తమ్‌ను మార్చవద్దంటూ లేఖ రాస్తానన్నారు. రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అడుగుతున్నాడన్న ఆయన అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని అన్నారు. రేవంత్ కి పీసీసీ ఇవ్వొద్దనే చెప్తానన్న ఆయన, నన్ను అడగకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే… నా రాజకీయం నాకు ఉంటుందని, కొత్త ఆలోచన ఉందని అన్నారు. రేవంత్ తప్పితే… ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. రేవంత్ మీద తనకు అపోహలు ఉన్నాయన్న ఆయన ఆ విషయాలు రేవంత్ కే చెప్తానని అన్నారు.

ఆ మాటకు వస్తే తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని అన్నారు. ఉత్తమ్… తన భార్యను గెలిపించుకోలేదు కాబట్టి అన్ ఫిట్ అనేది రేవంత్ వర్గం చేసిన ప్రచారమని, మరి అందరినీ గెలిపిస్తా అని తిరిగిన రేవంతే ఓడిపోయాడు కదా ? రేవంత్ సోషల్ మీడియా టీం దానికి ఏమంటారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో చాలా మంది ప్రభుత్వ కోవర్టులు ఉన్నారన్న ఆయన పార్టీ ఇంఛార్జీ కుంతియా చుట్టే ఆ కోవర్టులు ఉన్నారని అన్నారు. అలాగే కూతురు జయారెడ్డికి రాజకీయాలు ఇష్టం లేదని, కానీ పరిస్థితి ని బట్టి జయారెడ్డి ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నానని అన్నారు. నాపై రాజకీయ కక్షసాధింపుకు దిగితే నా కూతురు రాజకీయాల్లో ఉంటుందని, జగ్గారెడ్డి కంటే గట్టిగా కొట్లాడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *