Breaking News
Home / States / పోలీసుల కళ్లు గప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత….

పోలీసుల కళ్లు గప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత….

హైదరాబాద్: పోలీసుల కళ్లు గప్పి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ప్రగతి భవన్ సమీపంలోని ఓ హోటల్‌కు ఆయన చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్కచేయడం లేదని, ప్రభుత్వ తీరుతో జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వాలే కోర్టులను గౌరవించకపోతే ఎలా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందా? అని ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *