Breaking News
Home / Politics / రాజ్యాంగం చదవకపోవటం బాధాకరం….

రాజ్యాంగం చదవకపోవటం బాధాకరం….

హైదరాబాద్: కేసీఆర్ లాంటి మొండి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో ఉపయోగపడిన వారు ఇప్పుడు మంచి వారు కాకుండా పోయారా? అని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదన్నారు. ఎంత తొందరగా కార్మికుల సమస్యను పరిష్కరిస్తే.. అంత మంచిదన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రాజ్యాంగం చదవకపోవటం బాధాకరమని, కార్మికుల జీతాల విషయంలో కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పటం దురదృష్టకరమని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలో.. మీ మిత్రడు జగన్‌ను అడగాలని వీహెచ్ సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *