Breaking News
Home / States / ఎన్నికలపై ఆయనకు భయం పట్టుకుంది…

ఎన్నికలపై ఆయనకు భయం పట్టుకుంది…

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్ఎస్  భారీగా నగదు ఖర్చుచేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఖర్చు చేసే మొత్తాన్ని ఆ పార్టీ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని సీఈవో రజత్‌కుమార్‌ను కోరినట్లు శశిధర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ ఛానల్‌, ఓ ఇంగ్లిష్ పత్రికలో భారీగా ఆ అభ్యర్థి ప్రకటనలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్యం, నగదు సరఫరా జరుగుతోందని.. దీన్ని అరికట్టాలని సీఈవోను కోరినట్లు చెప్పారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని.. ఈ విషయంలో మంత్రులపై కేసులు నమోదు చేయాలన్నారు. హుజూర్‌నగర్ సభలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఆయన వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *