Breaking News
Home / States / ఆ పత్రికలను దహనం చేయడం దుర్మాగం….

ఆ పత్రికలను దహనం చేయడం దుర్మాగం….

హైదరాబాద్: యాదాద్రిలో జరుగుతున్న వ్యవహారంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం దారుణం అని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూల విరాట్‌ను చెక్కడం అంటే మహా పాపం అని పేర్కొన్నారు. పునర్నిర్మాణాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షించాల్సిందని అన్నారు. సినిమా ఆర్కిటెక్ ఆనంద సాయికి ఆ బాధ్యతలు ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. ఆలయ నిర్మాణంలో మొదటి నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. నిర్మాణంలో లోపాలను ఎత్తి చూపించిన పత్రికలను దహనం చేయడం దుర్మార్గపు చర్య అని టీఆర్ఎస్ శ్రేణుల వైఖరిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. పత్రికల్లో కథనాలు వస్తే ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఆంధ్రజ్యోతి కథనాలను ప్రజలు హర్షిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *