యాదాద్రి: ఆర్టీసీ కార్మికుల సమస్యపై అవసరమైతే ఆమరణదీక్ష చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 50 వేల మంది కార్మికులను తొలగిస్తామంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎర్రబెల్లి, తలసానికి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పక్క రాష్ట్ర సీఎం జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పారు. కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దు..కొట్లాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు.
