Breaking News
Home / States / Andhra Pradesh / బీజేపీ నేతపై కాంగ్రెస్ నేత ఆగ్రహం…

బీజేపీ నేతపై కాంగ్రెస్ నేత ఆగ్రహం…

విజయవాడ: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక హోదాపై నాటకాలు మానుకోవాలనడం సరికాదన్నారు. పదేళ్లు హోదా కావాలని అడిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిది నాటకమా..? హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీది నాటకమా..? అని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు రూ. 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ముష్టి వేసినట్లుగా రూ. 1050 కోట్లు ఇవ్వడం వాస్తవం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి రూ. 5 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎంగిలి మెతుకులు విసిరినట్లు రూ. 16 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, కశ్మీర్‌పై చూపుతున్న శ్రద్ధలో పదోవంతైనా ఏపీపై చూపాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *