Breaking News
Home / Politics / వారి డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తాం…

వారి డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తాం…

హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెప్పినా సీఎం కేసీఆర్‌ లెక్క చేయకపోవడం నియంతృత్వానికి నిదర్శనమని అన్నారు. కోర్టు కామెంట్‌ చేస్తే గతంలో నాయకులు పదవులకు రాజీనామా చేసేవారని, ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తామని చెప్పారు. ఆర్టీసీ కండక్టర్ సురేందర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.50వేలు అందజేస్తానని, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు జనసేన మద్దతిస్తోందని వీహెచ్‌ తెలిపారు.

Check Also

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

Share this on WhatsAppకరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *