Breaking News
Home / States / రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ముందస్తు అరెస్టులు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ముందస్తు అరెస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతల ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యనాయకులను వారి ఇళ్ల వద్దే గృహ నిర్భందం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేత షబ్బీర్‌ అలీని ఇవాళ ఉదయమే గృహ నిర్భందం చేశారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రగతిభవన్‌ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సమ్మె ఉద్ధృతరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రగతిభవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *