Breaking News
Home / Politics / తెజస అధ్యక్షుడితో కాంగ్రెస్ నేతలు భేటీ…

తెజస అధ్యక్షుడితో కాంగ్రెస్ నేతలు భేటీ…

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అన్ని పక్షాల ఓట్లు రాబట్టేందుకు ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తెజస అధ్యక్షుడు కోదండరామ్‌తో కాంగ్రెస్‌ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్‌ సమావేశమై ఈ ఉపఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని వారు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెజస తమకు మద్దతిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని కోదండరామ్‌ వెల్లడించారు.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలను అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సీపీఐ మద్దతు కోరుతూ కాంగ్రెస్‌, తెరాసలు ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానంతో చర్చలు జరిపాయి. దీనిపై ఆ పార్టీ నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *