Breaking News
Home / States / Telangana / ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం

ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఏకమైన ప్రజాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టత నిచ్చారు. ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అని తేల్చి చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని, ప్రధాని కావాలన్న ఆశ లేదని చంద్రబాబు తెలిపారు. నివారం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రోడ్‌షో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అబద్ధాల కోరు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోరు పారేసుకోవడం మోదీ, కేసీఆర్‌కు అలవాటన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని హితవు పలికారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ధ్యేయమని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా అభద్రతాభావంతో ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Check Also

రేపు లండన్‌‌కు వెళ్లనున్న వైఎస్ జగన్

Share this on WhatsAppహైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి లండన్‌‌కు వెళ్లనున్నారు. గురువారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *