Breaking News
Home / Politics / ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది….

ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది….

సంగారెడ్డి: కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండబోదని అన్ని వర్గాల ప్రజలు అనుకున్నారని.. కానీ దానికి విరుద్ధమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని వాపోయారు. ఇంత అన్యాయమైన, దారుణమైన పరిస్థితులు ఉంటాయని ఎవ్వరు ఊహించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సుదీర్ఘంగా నడుస్తున్న ఉద్యమం ఆర్టీసీ సమ్మె అని, రోజురోజుకీ ప్రజలు, కార్మిక, ఉద్యోగ సంఘాల మద్దతు పెరుగుతున్నా.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక పక్క హైకోర్టు చీవాట్లు పెడుతున్నా.. ప్రభుత్వం మౌనం వహిస్తుండటం, ఒంటెద్దు పోకడలకు నిదర్శనమన్నారు.

తెలంగాణలో గొంతు విప్పే అవకాశం లేదని.. పోలీస్ రాజ్యం నడుస్తోందని, పోలీసులతో ఉద్యమాన్ని అణచి వేస్తూ ప్రజల గొంతు నొక్కుతున్నారన్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి ప్రభుత్వాలు కేసీఆర్‌లాగే పోలీసులను ప్రయోగిస్తే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ తన అండదండలు ఉంటాయన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *