హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అతిపెద్ద అవినీతిని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసింది. టెండర్లు పిలవకుండా నామినేషన్ కింద ఈ పనులను ఎలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న ఆసక్తి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేదని దుయ్యబట్టారు. తక్షణమే ఈ పనులను రద్దు చేయాలని.. వాటిని ప్రతిపాదించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు.
