హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు, ఢిల్లీ పర్యటనపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావుకు ఆగమేఘాల మీద మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారని, టీఆర్టీ అభ్యర్థుల ఆవేదన సీఎంకు పట్టదా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
