Breaking News
Home / National / ఐదుగురితో కాంగ్రెస్-ఎన్‌సీపీ కమిటీ…..

ఐదుగురితో కాంగ్రెస్-ఎన్‌సీపీ కమిటీ…..

ముంబై: మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి చెరో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశాయి. ఎన్‌సీపీ నుంచి కమిటీ సభ్యులుగా జయంత్ పాటిల్, అజిత్ పవార్, చగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, నవాబ్ మాలిక్ ఉంటారు. కాంగ్రెస్‌ నుంచి కమిటీకి అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, ఫృధ్వీరాజ్ చవాన్, మానిక్ రావ్ థాక్రే, విజయ్ వడెట్టివార్ సభ్యులుగా ఉంటారు. సంయుక్త చర్చలు ఎప్పుడు జరపాలి, ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చిచేందుకు తమ నేత జయంత్ పటేల్, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్‌లు ఇవాళ సమావేశమై నిర్ణయం తీసుకుంటారని ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మీడియాకు తెలిపారు. 2020 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *