Breaking News
Home / National / వలస కార్మికుల కోసం కాంగ్రెస్ సంచలన నిర్ణయం

వలస కార్మికుల కోసం కాంగ్రెస్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుని అల్లాడుతున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కమిటీలే భరిస్తాయని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు. ‘‘వలస కూలీలు, కార్మికులందరి రైలు ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చులను స్థానిక కాంగ్రెస్ కమిటీలు భరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వారికి సాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది..’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

కాగా వలస కార్మికుల కష్టాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ సోనియా నిప్పులు చెరిగారు. వారి కష్టం, త్యాగం, మన దేశానికి పునాది అని గుర్తుచేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె కేంద్రానికి లేఖ రాశారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముక అనీ.. వారు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4 గంటలు సమయం ఇచ్చి లాక్‌డౌన్ విధించిందంటూ ఆమె మండిపడ్డారు. ‘‘తోటి పౌరులైన వలస కార్మికుల సేవలను గౌరవిస్తూ వారికి సహకారం అందించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వారితో భుజం భుజం కలిపి నిలబడతాం..’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *