Breaking News
Home / National / ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ….

ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ….

న్యూఢిల్లీ: ఈ నెల 21 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే తన కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కంకావ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నారాయణ్ రాణే  ప్రకటించారు. బీజేపీ విడుదల చేసే రెండో జాబితాలో నితేష్ రాణే పేరు ఉంటుందని స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలలోపే నితేష్ రాణే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన నితేష్ రాణే.. ప్రస్తుతం బీజేపీలో చేరడంపట్ల కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *