Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ సంఘీభావం…

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ సంఘీభావం…

నిజామాబాద్‌: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపు గెలుపే కాదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని, గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. ఆ కుట్రకు వ్యతిరేకంగానే సమ్మె జరుగుతోందని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *