Breaking News
Home / Crime / ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

సూర్యాపేట: ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరులో ఉరి వేసుకొని వీరపునేని శ్రీధర్(36) అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్ నగర్‌లో శ్రీధర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిన్న పెద్ద కుమారుడికి అక్షరాభ్యాసం చేయించిన శ్రీధర్.. నేడు చిన్న కుమారుడికి అన్నప్రాసన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆయనను కుటుంబ సభ్యులు అప్పుల విషయమై మందలించేసరికి… మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *