Breaking News
Home / States / సీఎం ఫామ్‌హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య…

సీఎం ఫామ్‌హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య…

సిద్దిపేట: ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య కలకలం రేపుతోంది. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు.. గన్‌తో కాల్చుకుని చనిపోయాడని చెబుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్‌కు తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లు స్వగ్రామం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *