Breaking News
Home / Crime / ఆస్తి కోసం సవతి తల్లిని దారుణంగా చంపిన కానిస్టేబుల్

ఆస్తి కోసం సవతి తల్లిని దారుణంగా చంపిన కానిస్టేబుల్

హైదరాబాద్: నగరంలోని మాదన్నపేట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లిని కానిస్టేబుల్ దారుణంగా చంపాడు. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకివెళితే.. మాదన్నపేట్‌కు చెందిన యాదయ్యకు ఇద్దరు భార్యలు. ఈ మధ్య కాలంలోనే యాదయ్య అనారోగ్యంతో చనిపోయాడు. దహన కార్యక్రమంలో కూడా పెద్ద భార్య కొడుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆస్తి కోసం గొడవ పడటంతో స్థానిక పోలీసులు వచ్చి సముదాయించారు.

బతికి ఉన్నప్పుడే తండ్రి శ్రీకాంత్‌కు బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు ఇవ్వడం జరిగింది. తండ్రి రెండో భార్యకు ఇచ్చిన ఆస్తి తనకే కావాలని మంగళవారం ఉదయం మాదన్నపేట్‌లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి.. ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల కళ్లలో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగా ఆ కిరాతకుడు చంపేశాడు. కళ్ల ఎదుటే తల్లి హత్య చూసిన ఇద్దరు పిల్లలు భయబ్రాంతులకు గురై కోలుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఈ ఘటన జరిగిన అనంతరం కానిస్టేబుల్ పరారయ్యాడని తెలుస్తోంది. స్థానిక సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వెంకట్ రెడ్డి

Share this on WhatsAppకరీంనగర్: ప్రజలకు కావాల్సింది లంచాల తెలంగాణ కాదు.. బతుకుల తెలంగాణ కావాలి అని సీపీఐ రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *