ఢిల్లీ: ఓ ఛానల్లో ప్రసరామవుతున్న రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్ 11’లో ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహ కక్కర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ గాయకుడు పాటపాడిన అనంతరం తనను గుర్తుపట్టాల్సిందిగా జడ్జి నేహాను కోరడంతో ఆమె స్టేజీ మీదకు వెళ్లింది. అప్పుడు అతడు తన వెంట తీసుకొచ్చిన కొన్ని బహుమతులను ఆమెకు అందజేశాడు. ఆమె కృతజ్ఞతగా ఆ వ్యక్తిని కౌగిలించుకోగా ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. దీంతో షాక్కు గురైన సహ జడ్జీలు, యాంకర్ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఊహించని సంఘటనకు కలత చెందిన నేహా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
