Breaking News
Home / National / గవర్నర్ నివాసం ముందు కొనసాగుతున్న సీఎం ఆందోళన

గవర్నర్ నివాసం ముందు కొనసాగుతున్న సీఎం ఆందోళన

పుదుచ్చేరి: పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం చేపట్టిన ధర్నా కొనసాగుతూనే ఉంది. ఆయనకు ఇవాళ డీఎంకే కూడా మద్దతు పలకడంతో ఆందోళన మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సీఎం నారాయణ స్వామికి ఫోన్ చేసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై ఇరువురు నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా డీఎంకే మద్దతుపై ఆ పార్టీ చీఫ్ స్టాలిన్‌కు పుదుచ్చేరి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 39 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సంఘర్షణ నెలకొన్నట్టు ఆయన వెల్లడించారు.

‘‘స్టాలిన్ మద్దతుకు నా కృతజ్ఞతలు. మాకు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా మద్దతు ఉంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న దాదాపు 39 సమస్యల్లో హెల్మెట్ సమస్య ఒకటి మాత్రమే. ఈ సమస్యలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వల్లే వస్తున్నాయి…’’ అని స్వామి పేర్కొన్నారు. కాగా సీఎంతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ నివాస్ (గవర్నర్ నివాసం) వద్దుకు చేరుకోవడంతో ఇక్కడి టెన్షన్ వాతావరణం నెలకొంది.

Check Also

తుంగ నదిలో చేపల మృతి…ప్రజల కలవరం

Share this on WhatsAppనది నీరు తాగకుండా తీరప్రాంత గ్రామాల ప్రజల భయాందోళనలు శివమొగ్గ : కర్ణాటక రాష్ట్రంలోని తుంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *