Breaking News
Home / National / లోక్‌సభలో అనుసరించిన వైఖరికి భిన్నంగా : సంజయ్ రౌత్

లోక్‌సభలో అనుసరించిన వైఖరికి భిన్నంగా : సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో రాజ్యసభలో తమ పార్టీ అనుసరించనున్న వైఖరిపై శివసేన స్పందించింది. తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ… ‘బిల్లుపై మా అనుమానాలు ముందు నివృత్తి చేయాలి. సంతృప్తికరమైన సమాధానాలు రాకుంటే లోక్‌సభలో అనుసరించిన వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటాం’ అని రౌత్ తెలిపారు.

సోమవారంనాడు లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ముందు చర్చ సందర్భంగా బిల్లుపై పలు విమర్శలు గుప్పించిన శివసేన, ఓటింగ్ సమయంలో మాత్రం బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. దీనిపై సంజయ్ రౌత్ ఇవాళ మాట్లాడుతూ, బిల్లుపై తమకు కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నివేళలా పనిచేయవని, అది సరికూడా కాదని అన్నారు. హిందూ-ముస్లింలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు చేయరాదని,శ్రీలంకలోని తమిళ హిందువుల ప్రస్తావన కూడా బిల్లులో లేదని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలో మద్దతుకు, రాజ్యసభలో మద్దతుకు తేడా ఉందని ఆయన చెబుతూ, లోక్‌సభలో ఏ నిర్ణయం తీసుకున్నామనేది ఇక్కడ ప్రధానం కాదని, రాజ్యసభలో శివసేన ఎంపీల మద్దతు చాలా కీలకమని అన్నారు. బిల్లుపై జరిగే చర్చలో ఏమి చెబుతారో చూసి ఆ తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తామని రౌత్ వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *