Breaking News
Home / States / ఆ రంగాల అభివృద్ధికి సహకరించండి: జోషి

ఆ రంగాల అభివృద్ధికి సహకరించండి: జోషి

హైదరాబాద్: రాష్ట్రంలో కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర కెమికల్స్, పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి పి. రాఘవేంద్రరావు శుక్రవారం జోషిని ఆయన కలిశారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాల అభివృద్ధి విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోందని జోషి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ రెండు రంగాలు తగిన రీతిలో అభివృద్ధి చెందిన పక్షంలో రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాకుండా, మరోవైపు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సైతం లభిస్తాయని జోషి చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఐపీఈటీ కార్యకలపాలపై సమావేశంలో చర్చించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *