Breaking News
Home / States / Andhra Pradesh / మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాం…

మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాం…

విజయవాడ: నగరంలోని కొత్తపేట రాజా సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని త్వరలోనే మినీ ప్రభుత్వ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చామని అన్నారు. వైద్యవిధాన అధికారులతో చర్చించి కొద్దిరోజుల్లోనే ఆసుపత్రి పనులు ప్రారంభిస్తామన్నారు. అంబులెన్స్, వాహనాలు రావడానికి అనువుగా మున్సిపల్ కమిషనర్‌తో చర్చలు జరిపి రహదారి వెడల్పు, అభివృద్ధి పనులు చేయిస్తామని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *