Breaking News
Home / Lifestyle / Recipes / మొక్కజొన్న ఉల్లిగారెలు

మొక్కజొన్న ఉల్లిగారెలు

కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు – 1 కిలో లేతవి, అల్లం – 1 అంగుళం ముక్క, పచ్చిమిర్చి – 50 గ్రా. జీలకర్ర, కరివేపాకు – తగినంత, బియ్యంపిండి – 200 గ్రా., ఉప్పు – తగినంత, ఉల్లిపాయలు – మూడు (ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), నూనె – పావుకిలో.

తయారుచేసే విధానం
లేత మొక్కజొన్న గింజలను మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. అందులో అల్లం, మిర్చి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కరివేపాకు, జీలకర్ర, బియ్యంపిండి, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. స్టౌ మీద బాండీ పెట్టి సరిపడా నూనె వేసి మరిగిన తర్వాత అందులో మనకిష్టమైన పరిమాణంలో గారెలు వేసి దోరగా వేయించుకోవాలి. టమోటో, పచ్చిమిర్చి కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి చేసిన చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది.

Check Also

రుచికరంగా ‘ఫ్రీడమ్‌ కుకరీక్లాస్‌ -8’

Share this on WhatsAppమాస్టర్‌ చెఫ్‌ ఇండియా సీజన్‌-2 ఫైనలిస్ట్‌, మాస్టర్‌ చెఫ్‌ పునీతమెహతా ఆధ్వర్యంలో ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *