Breaking News
Home / Health / భారత్‌లో మూడో వ్యక్తికి కరోనా..

భారత్‌లో మూడో వ్యక్తికి కరోనా..

తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్‌ భారత్‌లోనూ క్రమంగా వ్యాపిస్తోంది. తాజాగా దేశంలో మూడో వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని కాసర్‌గఢ్‌లో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. బాధితుడు ఇటీవల వుహాన్‌ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదే రాష్ట్రంలో మరో రెండు కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజా కేసుతో కరోనా బాధితుల సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *