Breaking News
Home / World News / ప్రపంచవ్యాప్తంగా 97 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 97 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 97 లక్షలు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 97,11,805 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,91,856 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 52,50,085 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 25,04,588 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,26,780 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,52,293 మంది కోలుకున్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *