Breaking News
Home / National / హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!

హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తూ…మెల్లగా మన దేశంలో కూడా నేనున్నాంటున్న కరోనావైరస్‌ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనావైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో ఒక సందేశాన్ని ట్వీట్‌ చేశారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *