Breaking News
Home / World News / ఒకే సంస్థలో పనిచేసే 1000 మందికి కరోనా .!

ఒకే సంస్థలో పనిచేసే 1000 మందికి కరోనా .!

బెర్లిన్: ఓ సంస్థలో పని చేసే సుమారు వెయ్యి మందికి కరోనా వైరస్ సోకడంతో.. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన మాంసం శుద్ధి సంస్థ టొన్నీస్‌లో పని చేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. సుమారు 1000 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ మూతపడగా.. అందులో పని చేసే 6,500 మంది ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను క్వారెంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జర్మనీలో ఇప్పటి వరకు 1.91లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 8వేల మంది మహమ్మారి కారణంగా మరణించారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *