Breaking News
Home / National / మంత్రితో పాటు 17 మంది సిబ్బందికి కరోనా…

మంత్రితో పాటు 17 మంది సిబ్బందికి కరోనా…

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్, అతని భార్య అమృతా రావత్, మరో 17 మంది కుటుంబసభ్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మంత్రి తోపాటు అతని కుటుంబసభ్యులను డెహ్రాడూన్ నగరంలోని సొంత ఇంట్లో క్వారంటైన్ చేశారు. మంత్రి ఇంట్లో పనిచేస్తున్న 17 మంది సిబ్బంది, కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా సోకిన మంత్రి సత్పాల్ మహారాజ్ శుక్రవారం ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సీఎం త్రివేండ్రసింగ్ రావత్ తోపాటు మంత్రులందరినీ హోంక్వారంటైన్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి జేసీ పాండే చెప్పారు. మంత్రి దంపతులతోపాటు అతని ఇద్దరు కుమారులు, వారి భార్యలు, ఆరునెలల వయసున్న మనవడికి కూడా కరోనా వైరస్ సోకింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *